తెలంగాణలో బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి. ఉ. 9 గంటలకు ప్రారంభమైన పరీక్షలకు సెట్ ‘బి’ ప్రశ్నా పత్రాన్ని ఎంపిక చేశారు. మొదటి రోజు ఫస్ట్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ పేపర్ -1 పరీక్షకు 5,14,184 మంది నమోదు చేసుకోగా, పరీక్షకు 4,96,899 విద్యార్థులు హాజరై, 17, 010 మంది గైర్హజరైనట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా రెండు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయినట్టు పేర్కొంది.