ఐఫోన్‌ ధరలు రూ.6000 వరకు తగ్గింపు

62చూసినవారు
ఐఫోన్‌ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్‌లో ఐఫోన్‌ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్‌ ప్రకటించింది. మొబైల్‌ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. ఐఫోన్‌ ప్రో మోడళ్ల ధరలు రూ.5100-6000 చౌకయ్యాయి. ఇంతకు ముందు యాపిల్‌ ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ ప్రారంభ ధరలు వరుసగా రూ.1,34,900, రూ.1,59,900గా ఉన్నాయి. ఇప్పుడు రూ.1,29,800కే లభించనుంది. ఇంతకు ముందుతో పోలిస్తే ధర 3.7 శాతం తగ్గింది.

సంబంధిత పోస్ట్