ఇరిగేషన్ వార్: నేడు మేడిగడ్డకు రేవంత్.. నల్గొండకు కేసీఆర్

103233చూసినవారు
ఇరిగేషన్ వార్: నేడు మేడిగడ్డకు రేవంత్.. నల్గొండకు కేసీఆర్
తెలంగాణలో నేడు ఓ వైపు మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభ.. మరోవైపు సీఎం మేడిగడ్డ బ్యారేజీ సందర్శన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కుంగిన మేడిగడ్డ బ్యారేజీని సందర్శించేందుకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలంతా వెళ్లనున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తుందంటూ నిరసిస్తూ బీఆర్ఎస్ నల్గొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. దీంతో పరస్పర విమర్శలు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది.

సంబంధిత పోస్ట్