అభయహస్తం పథకంలోని రూ.385 కోట్ల నిధులను మహిళలకు తిరిగివ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2009లో అభయహస్తం పథకంలో భాగంగా మహిళలు రోజుకు రూపాయి చొప్పున ఆరేళ్లపాటు చెల్లించారు. ఈ నిధులను గత ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించినట్లు గుర్తించింది. 2022 నాటికి ఆ డబ్బులు వడ్డీతో కలిపి రూ.545 కోట్లకు చేరాయి. ఇప్పుడు వీటిని తిరిగివ్వాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం.