ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి ఓ రేంజ్‌లో ఉంది. అనంత్-రాధిక కోసం ఆ కుటుంబం వరుసగా చేస్తోన్న ముందస్తు వేడుకలకు అంతా అబ్బురపడుతున్నారు. ఇక వారు వేసుకునే దుస్తులు, నగల గురించి అయితే చెప్పనక్కర్లేదు. తాజాగా ఈశా అంబానీ వేసుకున్న కంఠాహారంపై అందరి దృష్టిపడింది. ఈశా పింక్, గోల్డ్ లెహంగా ధరించారు. అలాగే తనతల్లి నగలను పెట్టుకున్నారు. వజ్రాలు, ఎమరాల్డ్‌లు (మరకతం) కలగలిసిన ఈ నెక్లెస్‌లో భారీతనం ఉట్టిపడింది.