ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సోమవారం లెబనాన్ లోని 300లకు పైగా హిజ్బుల్లా స్థావరాలపై వైమానిక దాడి చేసింది. దక్షిణ లెబనాన్ లో నివాసం ఉండే ప్రజలు తమ ఇళ్లు, భవనాలను తక్షణమే ఖాళీ చేయాలని ఆ దేశ సైనిక బృందం హెచ్చరించింది. ఆ ప్రదేశంలో హిజ్బుల్లా ఉగ్రవాదులు ఆయుధాలను నిల్వ చేశారని పేర్కొంది. కాగా గత వారం ఇరాన్ మద్దతుతో ఓ సాయుధ బృందం ఇజ్రాయెల్ పై 140కి పైగా క్షిపణులను ప్రయోగించిన విషయం తెలిసిందే.