రైతులే నిన్ను బొందపెడతారు: ఈటల

72చూసినవారు
రైతులే నిన్ను బొందపెడతారు: ఈటల
రైతులని నమ్మించి మోసం చేస్తే.. రైతులే నిన్ను బొందపెడతారని సీఎం రేవంత్‌పై BJP ఎంపీ ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతుల కోసం ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద BJP తలపెట్టిన 24 గంటల దీక్షను మంగళవారం ఆయన విరమించి మాట్లాడారు. రూ.2 లక్షల రుణమాఫీని వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. ఒక కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ అనే నిబంధన తొలగించాలన్నారు. హైడ్రాపై కోర్టు చేసిన వ్యాఖ్యలను రేవంత్ గుర్తుంచుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్