వినియోగదారులపై మరో భారాన్ని మోపేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ట్రూఅప్ ఛాార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో డిస్కంలు వినియోగదారుల నడ్డి విరిచాయి. తాజాగా మరో ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో భారీగా మోపేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఎపిఇఆర్‌సి)కి ప్రతిపాదనలు పంపాయి. ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్‌మెంట్(ఎఫ్‌పిపిసిఎ) పేరుతో మూడు డిస్కంలు రూ.8113కోట్లు ఇఆర్‌సికి ప్రతిపాదించాయి.