ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఇవాళ్టితో గడువు ముగుస్తోంది. కొన్నిరకాల పెట్టుబడులపై నష్టాలు వస్తే వాటిని వచ్చే ఏడాది సమర్పించబోయే ITRలో చూపించవచ్చు. ఫలితంగా పన్ను ప్రయోజనాలు పొంది కొంత ఆదా చేసుకోవచ్చు. అయితే, గడువులోగా ఐటీఆర్ దాఖలు చేసినవారికి మాత్రమే ఈ ప్రయోజనం ఉంటుంది. స్టాక్ మార్కెట్, మూలధన రాబడి, వ్యాపారం వంటి ఆదాయాలకు ఇది వర్తిస్తుంది. ఇంటి ఆస్తిని అమ్మినప్పుడు వచ్చిన నష్టాన్ని మాత్రం గడువు తేదీ దాటినా సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఉంది.