పండ్లలో అతిపెద్ద పండు ‘పనస’. ఈ పండు చెట్లలో పూత జనవరి-మార్చి మధ్య వస్తుంది. పనస చెట్టలో పూత, పిందెలు ఎదిగే దశలో పూత, పిందె కుళ్లు తెగులు, కాయ తొలుచు పురుగు ఆశించి నష్టపరుస్తాయి. బూజు వల్ల వచ్చే పూత, పిందె, కాయకుళ్లు తెగులు మొదట మగపువ్వులను ఆశించి క్రమంగా ఆడ పువ్వులకు వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు ఆశించిన పిందెలు, ఎదిగే కాయలు కుళ్లిపోతాయి.