విశాఖను ఏపీకి రాజధాని చేస్తానన్న జగన్ రెడ్డి... విశాఖలోని ప్రభుత్వ ఆస్తుల్ని రూ.1941 కోట్లకు తాకట్టు పెట్టాడని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మరో రూ.40,000 కోట్ల విలువైన భూముల్ని జగన్ అండ్ కో కబ్జా చేసిందని చంద్రబాబు ఆరోపించారు. జగన్ ప్రతి మాట వెనుక దోపిడీ అలా ఉంటుంది.. ప్రతి పనిలో వినాశనం అలా ఉంటుందని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు.