Mar 29, 2025, 07:03 IST/జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల: విద్యుత్ షాక్తో వ్యక్తి దుర్మరణం
Mar 29, 2025, 07:03 IST
జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామానికి చెందిన చింతకుంట్ల రాజనర్సయ్య (58) శనివారం వాగులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వాగులో విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. వాగులో విద్యుత్ వైర్లు ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని బయటికి తీశారు.