జగిత్యాల పట్టణంలో ప్లకార్డులతో, నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో CPS కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం జగిత్యాల పట్టణంలోని ఆర్డిఓ చౌరస్తా వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడుతూ సెప్టెంబర్ 1 పెన్షన్ విగ్రహ దినంగా పాటిస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు చేసి, పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు.