ధర్మపురి: మాజీ ఎంపీటీసీ కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్

72చూసినవారు
ధర్మపురి: మాజీ ఎంపీటీసీ కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్
ధర్మపురి మండలం ఆరపెల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బొర్లకుంట రాజయ్య ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాజయ్య కుటుంబాన్ని మంగళవారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా రాజయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్