మెట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జువ్వాడి భవన్ లో ఆదివారం కేంద్ర మాజీ మంత్రి జి వెంకటస్వామి (కాక) వర్ధంతి సందర్బంగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు ఆయన చిత్రపటానికి పూలల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం, మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి అంజిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.