మెట్ పల్లి పట్టణంలోని జ్ఞానోదయ డిగ్రీ అండ్ పీజీ కాలేజీకి గత పది రోజులుగా అప్రకటిత సెలవులు కొనసాగుతున్నాయి. గత రెండు సంవత్సరాలుగా విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ రాకపోవడం వల్ల యాజమాన్యం అధ్యాపకులకు వేతనాలు చెల్లంచలేదని తెలుస్తోంది. దీంతో నాలుగు నెలల వేతనాల కోసం దాదాపు 20 మంది అధ్యాపకులు ఓపిక నశించి క్లాసులు చెప్పడం మానేసినట్టు సమాచారం. ఇలాంటి అప్రకటిత సెలవులపై యూనివర్సిటి అధికారులు ఎందుకు విచారణ చేయడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.