జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని కే ఎన్ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఇబ్రహీంపట్నం మెట్ పల్లి పద్మశాలి సేవ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో వన భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. గంగాధర్, శశిధర్, ప్రతాప్, భూపతి, మేట్పల్లి పద్మశాలి సంఘం అధ్యక్షుడు రాజారాం, గౌతమ్, భాస్కర్, ఇబ్రహీంపట్నం అధ్యక్షుడు మురళీ సుధీర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.