మెట్ పల్లి: సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజల సహకరించాలి

61చూసినవారు
మెట్ పల్లి: సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజల సహకరించాలి
మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంఛార్జి జువ్వాడి నర్సింగరావు మంగళవారం పాత్రికేయులకు పత్రిక ప్రకటనను ఆయన విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కుల గణన ఇంటింటి సమగ్ర సర్వేకు సర్వం సిద్ధమైందన్నారు. ఈనెల 6 నుంచి ప్రారంభం కానున్న సామాజిక విద్య ఆర్థిక ఉపాధి రాజకీయ కుల సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 80 వేల మంది సేవలను వినియోగించుకోవాలని సర్కారు నిర్ణయించిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్