Oct 15, 2024, 08:10 IST/
రైలు పట్టాలపై హైటెన్షన్ వైరు.. ఉత్తరాఖండ్‌లో తప్పిన పెను ప్రమాదం
Oct 15, 2024, 08:10 IST
రైల్వేట్రాక్‌లపై బండరాళ్లు, గ్యాస్ సిలిండర్లు పెట్టిన ఘటనలు ఇటీవల వరుసగా వెలుగుచూసిన సంగతి తెలిసిందే. తాజాగా డెహ్రాడూన్ నుంచి తనక్‌పూర్ వెళ్తున్న వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఖాతిమా రైల్వేస్టేషన్ దాటిన తర్వాత రైల్వేట్రాక్‌పై 15 మీటర్ల పొడవున్న హైటెన్షన్ వైరు పడి ఉండడాన్ని లోకోపైలట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో ప్రమాదం తప్పింది. ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్‌నగర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.