అమెరికాలో ఏటా గుమ్మడికాయల ఛాంపియన్‌షిప్ నిర్వహిస్తారు. ఈ సారి కూడా దక్షిణ శాన్‌ఫ్రాన్సిస్కోలోని హాఫ్ మూన్‌బేలో 51వ వరల్డ్ ఛాంపియన్‌షిప్ పంప్‌కిన్ వేఆఫ్ నిర్వహించారు. ఈ పోటీల్లో మిన్నెసోటాలోని అనోకాకు చెందిన ట్రావిన్ జింజర్ అనే హార్టీకల్చర్ టీచర్ భారీ సైజు గుమ్మడికాయతో విజేతగా నిలిచారు. ఆయన పండించి తెచ్చిన గుమ్మడికాయ బరువు ఏకంగా 1,121 కిలోలు. భారీ ఆకారంలో ఉన్న ఈ గుమ్మడికాయ విశేషంగా ఆకర్షించింది.