హుజురాబాద్
హుజురాబాద్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మంత్రి పొన్నం
కేశవపట్నం మండలం తాడికల్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు లేవని, కొనుగోలు చేసిన 24 గంటల లోపే ధాన్యం డబ్బులు రైతుల అకౌంట్లో జమ అవుతున్నాయని, ఇచ్చిన హామీ మేరకు సన్నవడ్లకు రూ. 500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలు పూర్తి అయిన వెంటనే డాటా ఎంట్రీ చేయాలని అధికారులకు సూచించారు.