వేములవాడ
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని గురువారం 40 వేల 984 మంది భక్తులు దర్శించుకున్నారని ఈవో వినోద్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వేకువజాము నుంచే భక్తులు కుటుంబ సమేతంగా సుదూర ప్రాంతాల నుంచి రాజన్న సన్నిధికి చేరుకొని ధర్మగుండలో పుణ్య స్నానాలు ఆచరించారు. కోడె మొక్కులతో కార్తీక దీపాలు వెలిగించి సేవలో తరించారు.