హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ‘అవతార్’ సినిమాకి భారత్‌లోనూ భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికే రెండు పార్టులు విడుదల కాగా, మూడో పార్ట్ కోసం ప్రేక్షకులు ఎంతగానో వేచి చూస్తున్నారు. ఇక ఈ మూడో పార్ట్‌కి ‘అవతార్’: ఫైర్ అండ్ యాష్ అనే టైటిల్ పెట్టారు. ‘ఇది కనులకు విందు. అయితే ఇది చాలా ఎక్కువ భావోద్వేగాలను కలిగి ఉంది. గతంలో కంటే ఎక్కువ’ అని కామెరూన్ అన్నారు. ఇక ఈ చిత్రం 2025 డిసెంబర్‌లో విడుదల కానుంది.