కొత్తపల్లి జయశంకర్ సార్ ఇంటర్ చదువుకునే రోజుల్లోనే నిజాంను కీర్తించడాన్ని వ్యతిరేకిస్తూ వందేమాతరం అంటూ స్ఫూర్తి శంఖం పూరించారు. 1952 ముల్కీ ఆందోళనలో పాల్గొన్నారు. తరువాత 1969 తెలంగాణా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్ర విభజన జరగాలంటే మొదట తెలంగాణ ప్రజల్లోకి తెలంగాణ భావజాల వ్యాప్తి జరగాలని విశ్వసించి తెలంగాణ వివిధ అంశాలకు సంబంధించిన వివిధ సమస్యలపై ఎన్నో వ్యాసాలు రాశారు.