బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అనర్హత కేసులో తీర్పు రిజర్వు

71చూసినవారు
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అనర్హత కేసులో తీర్పు రిజర్వు
పార్టీ ఫిరాయించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అనర్హత కేసుపై మంగళవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో తీర్పును డివిజన్‌ బెంచ్‌ రిజర్వు చేసింది. వాద, ప్రతివాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేస్తున్నట్లు బెంచ్‌ వెల్లడించింది. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్‌, కడియం శ్రీహరిలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

సంబంధిత పోస్ట్