రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ 'కల్కి 2898ఏడీ' మూవీ మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రానుంది. గురువారం అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉండనుంది. కాగా, జూన్ 27న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఓవరాల్‌గా రూ.1200 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించింది.