జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో దట్టంగా మంచు కురుస్తోంది. తాజా మంచు కారణంగా ఇక్కడికి వచ్చిన పర్యాటకులతో ప్రస్తుతం రద్దీగా ఉంది. భదర్వా ప్రాంతంలో, పర్యాటకులు మంచులో ఆడుకుంటూ, స్నోమెన్‌లను తయారు చేస్తూ, శీతాకాలాన్ని ఆస్వాదిస్తున్నారు. వాహనాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా బుల్డోజర్లతో రోడ్లపై మంచును తొలగిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.