కమలా హారిస్ భర్తకు కొవిడ్

80చూసినవారు
కమలా హారిస్ భర్తకు కొవిడ్
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భర్త డౌగ్ ఎమ్‌హాఫ్‌కు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఆయన కార్యాలయం ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రస్తుతానికి ఆయనకు లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని పేర్కొంది. ‘డౌగ్‌కు ఇప్పటికే 3 సార్లు వాక్సినేషన్, 3 సార్లు బూస్టర్ డోసు పూర్తయ్యాయి. ఇంటిదగ్గర నుంచే ఐసొలేషన్‌లో ఉంటూ ఆయన పనిచేసుకుంటున్నారు. ఇక కమలా హారిస్‌కు నిర్వహించిన టెస్టుల్లో నెగటివ్‌గా తేలింది’ అని వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్