ఆర్మూర్ ఏరియా ఆసుపత్రిలో పలువురికి బోదకాలు నిర్ధారణ కొరకు రక్త పరీక్ష నమూనాలు సేకరించడం జరుగుతుందని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ తెలిపారు. రక్త నమూనాల సేకరణ ప్రక్రియను పరిశీలించడం జరిగిందని, మొదటి దశలో భాగంగా డివిజన్ వ్యాప్తంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రితో పాటు పలు ప్రైవేట్ ఆస్పత్రులలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.