నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం అక్లూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వర్షపు నీరు చేరటంతో చెరువును తలపిస్తుంది. విద్యార్థులు పాఠశాలకు రావాలంటే భయపడుతున్నారు. అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి వర్షపు నీటిని తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.