ఘనంగా ఊర పండుగ

68చూసినవారు
ఘనంగా ఊర పండుగ
కామారెడ్డి జిల్లా పెద్దకొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో శుక్రవారం ఊర పండుగ (పస్క పండుగ) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు చెరువు సమీపంలోని ఎర్రమన్ను కుచ్చకు చేరుకొని వర్షాలు బాగా కురవాలని దేవుళ్ళకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా తొలకరి జల్లులు కురిశాక అడవికి చేరుకుని పస్క పండుగ జరుపుకుంటామని గ్రామస్థులు తెలిపారు.

సంబంధిత పోస్ట్