బాన్సువాడలో అక్రమ అరెస్టులతో మా ఉద్యమాన్ని ఆపలేరని ఎల్ఎస్ఓ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ జీవన్ నాయక్ మంగళవారం అన్నారు. ఫార్మా కంపెనీల పేరుతో లంబాడీల భూములు లాక్కోవడానికి వ్యతిరేకంగా చలో లగచర్లలో భాగంగా ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. ఈ అక్రమ అరెస్టులతో మా ఉద్యమాన్ని ఆపలేరు, అక్రమంగా జైలుకు పంపిన లంబాడి రైతులను విడుదల చేయాలి.. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిస్తామని అన్నారు.