కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని, ఇప్పటికే రైతు రుణ మాఫీ చేసిందని కిసాన్ కాంగ్రెస్ బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ శనిగరం కిషన్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రైతన్నకు ఇచ్చిన హామీ మేరకు పండించిన పంటకు రైతు ఖాతాలో బోనస్ డబ్బు జమ చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కిసాన్ కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.