బీర్కూర్: శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల పూజలు

72చూసినవారు
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల శివారులో గల తెలంగాణ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామి వారిని శుక్రవారం దర్శనం చేసుకున్నారు. ఉదయం నుండి భక్తులు వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి, తమ మొక్కులను చెల్లించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం గోవింద నామ స్మరణతో మారుమ్రోగింది.

సంబంధిత పోస్ట్