బీర్కూరు మండల కేంద్రంలోని కామప్ప చౌరస్తాలో శుక్రవారం దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ మాజీ ప్రధాని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లు శ్యామల, సురేష్ బాబా, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు