సౌత్ ఈస్ట్రన్ రైల్వే దేశ వ్యాప్తంగా వివిధ డివిజన్లలో ఖాళీగా ఉన్న 1785 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు ఇవాళ ముగియనుంది. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రిషియన్, కార్పెంటర్, మెషినిస్ట్, టర్నర్, మెకానిక్ డీజిల్, ట్రిమ్మర్, ఎంఎంటీఎం, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్, లైనామ్యాన్ తదితర ట్రేడుల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఐటీఐ/ఇంటర్ పూర్తి చేసిన వారు అర్హులు.