ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై సస్పెన్స్ కొనసాగుతోంది. జనవరి 1 నుంచి భూముల మార్కెట్ ధరలను పెంచే నిర్ణయంపై ప్రభుత్వం వెనకడుగు వేసింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమవడంతో దీనిపై పునరాలోచన చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 2025 జనవరి 1 నుంచి భూముల మార్కెట్ ధరలను పెంచే యోచన తాత్కాలికంగా వాయిదా వేసింది. ఈ నిర్ణయంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి అవసరమైన మార్పులు తీసుకోవాలని నిర్ణయించింది.