బాన్సువాడ పట్టణంలోని మున్సిపల్, తహసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాలలో నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ మంగళవారం హాజరయ్యారు. ప్రజా ప్రభుత్వంలో రైతులకు ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.