వరి ధాన్యంకు తరుగు పేరిట మిల్లర్లు రైతులను ఎలాంటి ఇబ్బందులు గురి చేయవద్దని, రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు, రైస్ మిల్లర్లకు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. శనివారం బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం స్వగృహంలో రైస్ మిల్లర్ల తో సమావేశం నిర్వహించి రైతులకు ఇబ్బంది కలగకుండా వరిధాన్యం తీసుకోవాలని సూచించారు.