తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో బాన్సువాడ గాంధీచౌక్ వద్ద ధర్మాగ్రహ దీక్ష నిర్వహించారు. తపస్ జిల్లా అధ్యక్షుడు పులగం రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి భూనేకర్ సంతోష్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలైన 4 డిఏలు, పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, పిఆర్సిని అమలు చేయాలని, 317 జిఓ బాధిత ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరించాలన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చారు.