ఆదివారం తెల్లవారుజామున ఉదయం 12 గంటల పది నిమిషాలకి నిజామాబాద్ మండలం ధర్మారం తండాకు చెందిన సుజాతకు మూడవ కాన్పు నిమిత్తం 108అంబులెన్స్ లో తరలిస్తుండగా మార్గమధ్యలో మల్లారం వద్దకు రాగానే నొప్పులు అధికమవడంతో 108 సిబ్బంది రాములు, తుకారం అంబులెన్స్ నిలిపి సుఖప్రసవం చేశారు. దాంతో సుజాత పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డలను క్షేమంగా జిల్లా ఆస్పత్రికి తరలించారు.