ఎడపల్లి మండలం సాఠాపూర్ గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సాంబాజీలాల్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సోమవారం తీవ్రంగా గాయపడిన వ్యక్తిని స్థానికులు 108కు సమాచారం అందించగా, అక్కడికి చేరుకున్న బోధన్ 108 సిబ్బంది వెంకటేష్, మురళీకృష్ణ ప్రథమచికిత్స చేసి నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.