కోటగిరి మండలం సోంపూర్ గ్రామానికి చెందిన మహిళ అంబులెన్స్ లో ప్రసవించింది. మంగళవారం తెల్లవారుజామున ఉదయం 3 గంటల సమయంలో కోటగిరి మండలం సోంపుర్ గ్రామానికి చెందిన గంగాసాగర్ అనే మహిళను మొదటి కాన్పు నిమిత్తము బోధన్ 108 అంబులెన్స్ లో తరలిస్తుండగా మార్గమధ్యంలో సాలురా వద్ద నొప్పులు అధికమైయ్యాయి. బోధన్ 108 సిబ్బంది అంబులెన్స్ నిలిపి ప్రసవం చేశారు. మహిళ పండంటి మగ బిడ్డ జన్మనిచ్చింది.