కామారెడ్డి: సెలైన్ పెట్టలేదని పోలీస్ స్టేషన్కు వెళ్లిన రోగి
గాంధారి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక రోగికి సెలైన్ పెట్టలేదని ఏకంగా పోలీస్ స్టేషన్కు వెళ్లడం జరిగింది. దీంతో పోలీసులు సంబంధిత ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి తిరిగి సెలైన్ పెట్టించి పంపించిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ప్రభుత్వ వైద్యునిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఇటీవల సరెండర్ కాగా అతని స్థానంలో ఇప్పటివరకు ఎవరు నియమితులు కాలేదు. దీంతో సామాన్య రోగులకు వైద్య సేవలు అందక బిక్కుబిక్కుమంటున్నారు.