Jan 22, 2025, 15:01 IST/
BIG BREAKING: తెలంగాణకు భారీ పెట్టుబడి
Jan 22, 2025, 15:01 IST
తెలంగాణకు భారీ పెట్టుబడి పెట్టేందుకు మరో సంస్థ ముందుకొచ్చింది. రాష్ట్రంలో రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్ర ప్రభుత్వంతో MoU చేసుకుంది. ఇందులో భాగంగా ఆ కంపెనీ భారీ పంప్డ్ స్టోరేజీ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టు చేపట్టనుంది. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో ప్రాజెక్టులు రానున్నాయి. సుమారు 7 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ దావోస్ పర్యటనలో ఈ MoU జరిగింది.