కామారెడ్డి జిల్లా బిచ్కుందలో గురువారం తేలికపాటి వర్షం కురిసింది. గత శుక్రవారం వరకు వర్షం కురవడంతో రైతులు పంటచేలలో విత్తనాలను విత్తుకున్నారు. తర్వాత వర్షం కురువకపోవడంతో, అధిక ఉష్ణోగ్రత ఎండలకు పంటలు నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురవాలని దేవుళ్ళను ప్రార్థిస్తున్నారు.