మానవత్వం చాటుకున్న మద్నూర్ ఎస్సై విజయ్ కొండ

74చూసినవారు
మానవత్వం చాటుకున్న మద్నూర్ ఎస్సై విజయ్ కొండ
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ ఎస్సై విజయ్ కొండ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సాయం చేసి మానవత్వం చాటుకున్నారు. విధి నిర్వహణలో భాగంగా ఆదివారం మద్నూర్ బై పాస్ రోడ్డు వైపు వెళ్తుండగా ప్రమాదాన్ని గమనించి వాహనాన్ని ఆపారు. గాయపడిన వారిని పోలీసు వాహనంలో ఎక్కించుకొని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయాలతో ఉన్న వారిని గుర్తించి వాహనంలో ఆసుపత్రికి తరలించిన ఎస్ఐ విజయ్ కొండని స్థానికులు అభినందించారు.

సంబంధిత పోస్ట్