రైతులకు లాభ దాయకంగా నూతన చట్టం: మాజీ ఎమ్మెల్యే

376చూసినవారు
రైతులకు లాభ దాయకంగా నూతన చట్టం: మాజీ ఎమ్మెల్యే
మద్నూర్ మార్కెట్ కమిటీ లో వ్యవసాయ రైతులను జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్ష్యురాలు మాజీ ఎమ్మెల్యే అరుణ తార కలవడం జరిగిందని మద్నూర్ మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు హన్మాండ్లు తెలిపారు. మార్కెట్ యార్డులో ఉన్నటువంటి వ్యవసాయ రైతులతో కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విధానం పై రైతులకు అవగహన కల్పించడం జరిగింది. దేశంలో రైతులు పండించిన పంట ఎక్కడైనా అమ్ముకునే అధికారాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. రైతులు కష్ట పడి పండించిన పంటను దళారుల యొక్క ఆగడాలు ఎక్కువగా కావడంతో రైతులకు ఎక్కువ ధర ఇవ్వకుండా తక్కువ ధరలతో రైతుల వద్ద సరుకులు కొనడం వలన రైతులకు సరైన పంట ధర కల్గకపోవడంతో రైతులు నష్టపోవడం జరుగుతుందని అరుణతార తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానం వలన రైతులకు గిట్టుబాటు దరతో పాటు రైతు ఎక్కడైనా అమ్ముకునే విధానం తేవడంతో అనేక రైతులకు లబ్ధిచేకూర్చడం జరుగుతుందని తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీకి నేరుగా రైతులకు తమ అభిప్రాయాలను, నూతన విధానం ప్రవేశంతో కలుగే లాభలను పోస్ట్ ద్వారా తెలపాలని కరపత్రాలను అందించడం జరిగింది. జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్ష్యురాలు అరుణతార తో పాటు మండల అధ్యక్షుడు హన్మాండ్లు, తుకారం, కృష్ణ పటేల్ రౌత్వార్, శక్కర్లా వార్, వెంకట్ కాలే, బీజేపీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్