జుక్కల్ సెగ్మెంట్లో సీనియర్లుగా చెప్పుకుంటున్న వ్యక్తుల చరిత్ర జుక్కల్ ప్రజలకు తెలుసని, హైదరాబాదులో హంగామా చేసినంతమాత్రాన ఇక్కడి ప్రజలు నమ్మరని, యువతని ప్రోత్సహించడమే నా లక్ష్యమని, తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదని జుక్కల్ ఎమ్యెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. శుక్రవారం బిచ్కుందలో మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆశయాల కనుగుణంగా యువతని రాజకీయంలో తీసుకురావడానికి కట్టుబడి పని చేస్తున్నాన్నారు.