బాలికల పాఠశాలలో సావిత్ర బాయి పూలే జయంతి

673చూసినవారు
బాలికల పాఠశాలలో సావిత్ర బాయి పూలే జయంతి
మద్నూర్ కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో సావిత్ర బాయి పూలే జయంతి నిర్వహించడం జరిగిందని పిఆర్టియు మండల మహిళ అధ్యక్ష్యురాలు జ్యోతి వాగ్మరే తెలిపారు. మంగళవారం రోజున బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినియులకు సమావేశం ఏర్పర్చి సావిత్ర బాయి పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి జయంతి నిర్వహించారు. ఉపాద్యాయురాలు జ్యోతి వాగ్మరే విద్యార్థినియులకు సావిత్ర బాయి పూలే యొక్క జీవిత చరిత్ర తెలియ జేశారు. ప్రత్యేకంగా మహిళలకు పెద్ద పిటగా ఉండి మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి తో పాటు విద్య , ఉపాధి , తదితర రంగాలలో మహిళలు ముందుకు సాగాలని కోరారు.
సావిత్రిబాయి ఫూలే, (1831 జనవరి 3– 1897 మార్చి 10) భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసింది. సమాజంలోని కులతత్వం, పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు ఫూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి అని తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో బాలికల ఉన్నత పాఠశాల ఉపాద్యాయురాల బృందం సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్